Danish Malever: రంజీ ట్రోఫీ ఫైనల్.. శతకం బాదిన యువ బ్యాటర్ 1 y ago
దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. 2024-25 సీజన్లో ఛాంపియన్‌గా నిలవడం కోసం కేరళ, విదర్భ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. డానిష్ మాలేవర్ (138* బ్యాటింగ్; 259 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశ్ ఠాకూర్ (5* బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కరుణ్ నాయర్ (86; 188 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.